50 ఏళ్లుగా లయోలా పాఠశాల విద్యను అందించడం అభినందనీయం

Mar 8, 2025 - 19:03
Mar 8, 2025 - 21:46
 0  54
50 ఏళ్లుగా లయోలా పాఠశాల విద్యను అందించడం అభినందనీయం
50 ఏళ్లుగా లయోలా పాఠశాల విద్యను అందించడం అభినందనీయం
50 ఏళ్లుగా లయోలా పాఠశాల విద్యను అందించడం అభినందనీయం

మాజీమంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

ఘనంగా లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఘన సన్మానం

సూర్యాపేట, 08 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్'- 50 ఏళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా యాజమాన్యం లయోలా పాఠశాలను నిర్వహించి విద్యను అందించడం అద్భుతమైన విషయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం లయోలా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు 1975-2025 బ్యాచుల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. చిన్ననాటి లయోలా పాఠశాలలో చదివిన మిత్రులు కలుసుకొని సంతోషాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. బాల్యం నాటి మధుర క్షణాలను జ్ఞాపకాలను గుర్తుచేసుకోనేలా ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. లయోలా పాఠశాల ప్రారంభంలో గ్రామీణ ప్రాంతాల్లో డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉండేవని, మంచి విద్యను అందిస్తూ వివిధ రంగాల్లో ఎంతోమందిని స్థిరపడేలా పాఠశాల యాజమాన్యం చేసిన కృషి ఎనలేనిదన్నారు. విద్య అనేది విజ్ఞానాన్ని, వివేకాన్ని, మనిషిని, మేధావిగా, ఉన్నతమైన వ్యక్తులుగా ఉండేలా దోహదం చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించారు. ఆయా బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు తమ తమ గురువులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మధురమైన క్షణాలను ఆస్వాదించారు. కార్యక్రమంలో లయోలా పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ లూయి దాస్, ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్, కోర్ కమిటీ ప్రెసిడెంట్ ఆకారపు రమేష్, వైస్ ప్రెసిడెంట్ పుట్ట కిషోర్, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పారిశ్రామికవేత్త చలసాని శ్రీనివాసరావు, రాచర్ల కమలాకర్, లయోలా పాఠశాల గోల్డెన్ జూబ్లీ కోర్ కమిటీ నాయకులు ఎం, జావీర్ అమల్, జి, కృపారావు, పి, ఆనంద, రావు వెంకట్ రెడ్డి, బానోతు శ్రీధర్, ఎస్, శంకర్,వి, సైదిరెడ్డి, బి, పురుషోత్తం రెడ్డి, గుర్రం సత్యనారాయణ రెడ్డి, దేవరశెట్టి జనార్దన్, సైధి రెడ్డి, మద్ది శ్రీనివాస్ యాదవ్, బూర శేఖర్, శ్రీధర్, పూర్వ విద్యార్థులు విద్యార్థిని, విద్యార్థులు వేలాది మంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333