ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు వైద్య పరీక్షలు

చర్ల తేదీ :10-02-2025: మండల కేంద్రంలోని సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న పెద్ద మిడిసిలేరు గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో వైద్యాధికారి డాక్టర్ దివ్య నయన గారి ఆధ్వర్యం లో 175 మంది విద్యార్థిని లకు వైద్య పరీక్షలు నిర్వహించారు.ఇద్దరు జ్వరం తో బాధపడుతున్న వారికి RDT మలేరియా టెస్టు చేస్తే వాళ్ళకి మలేరియా లేదు.వాళ్లకు మాములు జ్వరంగా గుర్తించి మందులు ఇవ్వడం జరిగింది
56 మంది విద్యార్థినిలకు చర్మ సమస్యలు, జలుబులకు దగ్గుకు మందులు ఇవ్వడం జరిగినది.
కాచి చల్లార్చిన నీటిని త్రాగ వలెను.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించవలెను.
కిటికీలకు దోమలు రాకుండా జాలీలు అమర్చాలి.
అని సూచించారు.
ఈ కార్యక్రమంలో
హెచ్.ఈ.ఓ బాబురావు,
ఎమ్ పి హెచ్ యస్ తిరుపతమ్మ
ఎమ్ ఎల్ హెచ్ పి దీప్తి మౌనిక
హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్, ,
మరియు సామ్రాజ్యం హెచ్ యమ్ గారు, ఈశ్వర్ పీ డీ, హాస్టల్ ఏ యన్ యమ్ మౌనిక
తదితరులు పాల్గొన్నారు.