31 న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి
తెలంగాణ వార్త 31 న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి* నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, విద్య రంగానికి 30% నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ నెల 31న జరగబోయే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయలని **ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కోశాధికారి బండి రవి* పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం లో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ కాలిలను భర్తీ చేయకుండా విద్యారంగానికి బర్జట్ సమావేశలలో తగిన నిధులు కేటాయించకుండా కేవలం 7.3% శాతం నిధులు కేటాయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గత ప్రభుత్వ లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని వారు దుయ్యబట్టారు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తేనే విద్యారంగం మెరుగుపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పోస్టులను అదేవిధంగా వివిధ శాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో మున్సిపాలిటీలలో బ్లీచింగ్ పౌడర్ చాలల్లని వారు అన్నారు. అదే విదంగా గ్రామాలలో కోతులు,కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని వారన్నారు.ప్రతి గ్రామపంచాయతీకి ప్రభుత్వ డాక్టర్ని నియమించి ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని వారు అన్నారు. గత ప్రభుత్వాల లాగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే గద్దె దించక తప్పదని వారు హెచ్చరించారు. ఈ నెల 31న జరిగే అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు....