104 గ్రాముల గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకులు అరెస్ట్ చేసిన ఆత్మకూరు పోలీస్

Sep 8, 2026 - 19:54
 0  1
104 గ్రాముల గంజాయి స్వాధీనం.. ఇద్దరు యువకులు అరెస్ట్ చేసిన ఆత్మకూరు పోలీస్

వివరాలను సర్కిల్ కార్యాలయం నందు వెల్లడించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్..

ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్నగూడెం గ్రామంలో గంజాయి తో ఉన్న ఇద్దరు యువకులు అదే గ్రామానికి చెందిన 23 సంవత్సరాల అల్లిపురి అఖిల్, 22 సంవత్సరాల మట్టపల్లి గంగరాజు లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 104 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూరు (ఎస్) పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 


ఈ సందర్భంగా సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు (ఎస్) ఎస్సై ఐలయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలి. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయని సీఐ రాజశేఖర్ అన్నారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా, వాటికి పూర్తిగా దూరంగా ఉండి చదువు, ఉద్యోగం, క్రీడలు వంటి సానుకూల మార్గాల్లో ముందుకు సాగుతూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజశేఖర్ హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333