ప్రతిభను కనపర్చిన విద్యార్థిని సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు

అడ్డగూడూరు 22ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బైరెడ్డి నర్సిరెడ్డి కుమారుడు ధనుష్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని అరవింద్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతూ నల్లగొండ జిల్లా తరఫున శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఫిజిక్స్ ఒలంపియాడ్ విభాగంలో హైదరాబాదులోని రవీంద్రభారతి లో ఫిజిక్స్ సబ్జెక్టులో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం అడ్డగూడూరు మండల కేంద్రంలో ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ నాయకులు ధనుష్ రెడ్డిని శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,పొన్నాల వెంకటేశ్వర్లు,దర్శనాల అంజయ్య, చిప్పలపల్లి మహేంద్రనాథ్, పూల పెళ్లి జనార్దన్ రెడ్డి, దాసరి బాలరాజ్, గజ్జెల్లి రవి,పూజారి సైదులు, పయ్యావుల రమేష్, గూడపు నరేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.