చికాగో అమరవీరుల త్యాగాలను వృదా కానియ్యం
మేడే స్ఫూర్తితో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పిలుపు
జోగులాంబ గద్వాల 1 మే 2002 వారు తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ఘనంగా 141వ మేడే దినోత్సవం గద్వాల జిల్లా కేంద్రం: అమెరికా చికాగో అమరవీరులు చిందించిన రక్త తర్పణ త్యాగాలను వృదా కానియ్యం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మేడే’ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బైక్ రిక్షా కార్మిక సంఘం అడ్డ పాత బస్టాండ్ వద్ద ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పతాకాన్ని ఎగరవేశారు.అలాగే లారీ హమాలీ యూనియన్ వద్ద ఎఐటియుసి పతాకాన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వేణుగోపాల్ ఎగురవేయగా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఆధ్వర్యంలో ఏఐటియుసి పతాకాలను ఆవిష్కరించారు. బండ్ల కార్మిక సంఘం అంబేద్కర్ సర్కిల్ లో ఎఐటియుసి పతకాన్ని ఆంజనేయులు ఎగరవేశారు. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ హాస్పిటల్ ల్లో సూపరిండెంట్ ఇందిర తో కలసి ఎఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరామారెడ్డి జెండా ఎగరవేశారు . పటాన్ పల్లి swc వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఐటియుసి జెండాను జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు పతాకాన్ని ఎగరవేశారు.ఈ సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు మాట్లాడుతూ చికాగో అమరవీరులు త్యాగాలను వృదా కానియ్యం అంటు మేడే స్పూర్తి ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలు పట్టని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
చారిత్రాత్మక పోరాటాల ఫలితం ఈ హక్కులు
"8 గంటల పనిదినం కోసం, బానిసత్వ విముక్తి కోసం, పెట్టుబడిదారీ ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . నాడు బ్రిటిష్ కాలంలో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, శ్రామికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ.. సామాన్యులపై గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని మోపుతూ పేద, మధ్యతరగతి వర్గాల పొట్ట కొడుతోందని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు, సమాజంలో చిచ్చుపెట్టే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి కార్మికుడు పోరాడాలని ఆంజనేయులు పిలుపు నిచ్చారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ... సామాజిక మార్పు కోసం, శ్రామిక లోకపు హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా కార్యదర్శి ఉప్పేరు కృష్ణ, ఎఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, ఉపాధ్యక్షులు రామనాథ్ ,aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్, లారీ హమాలీ యూనియన్ అధ్యక్షుడు రాజు,నారాయణ, బైక్ రిక్షా కార్మిక సంఘం అధ్యక్షుడు ధర్మాన, తిమ్మప్ప, కృష్ణ, బండ్ల కార్మిక సంఘం అధ్యక్షుడు బండి దవులు , మధు, మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి పరుశురాం ఆర్ఎంవో హేమలత, సెక్యూరిటీ పేషెంట్ కేర్ స్లీపర్స్ , పుటాన్పల్లి ఎస్ డబ్ల్యూ ఎస్ యూనియన్ నాయకులు రవి బుచ్చన్న ఎజ్కేల్ . ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు జెఎసి చైర్మన్ పరమేశ్వరయ్య భాస్కర్ సుధాకర్ గిరిరాజు అలాగే అఖిలపక్ష నాయకులు వెంకటరాములు ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు శంకర ప్రభాకరు కురవపల్లయ్య పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు అన్ని రంగాల కార్మికులు, ఎఐటియుసి ,సీపీఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని 141వ మేడే నినాదాలతో హోరెత్తించారు. ఎక్కడ చూసినా ఎర్ర ఎర్రని తోరణాలతో గద్వాలనే ఎరుపుమయం చేశారు.