హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐఎఫ్ఎస్ కు ఎంపిక

May 9, 2026 - 20:29
May 9, 2026 - 21:19
 0  1
హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐఎఫ్ఎస్ కు ఎంపిక
హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐఎఫ్ఎస్ కు ఎంపిక
హెడ్ కానిస్టేబుల్ కూతురు ఐఎఫ్ఎస్ కు ఎంపిక

తండ్రి, కూతురును సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట 09 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని  ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైనది. ఈ సందర్భంగా శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ నర్సింహ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని, సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ కూతురు యామిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖ నందు విధులు నిర్వర్తిస్తూ సిబ్బంది ఎలాంటి పని ఒత్తిడి ఉన్న కుటుంబాలకు సమయాన్ని కేటాయించి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నారని ఎస్పీ  అభినందించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైన యామిని ని పరీక్షలకు సన్నద్ధమైన విధానాన్ని, శిక్షణ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని, మరిన్ని ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని కూతురు సమక్షంలో సన్మానించి మంచి లక్ష్యాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచావని అభినందించారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబాలకు సమయాన్ని కేటాయించి పిల్లల చదువులు వారి లక్ష్యాలలో దిశా నిర్దేశం చేస్తూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమం నందు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంక్షేమ అర్ఎస్ఐ సాయిరాం, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333