హరిత హారం చెట్లు అగ్నికి అహుతి

పార్టీలు ఏవైనా ప్రకృతి రక్షించడం అందరి బాధ్యత..
జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : జిల్లాలోని రెండు నియోజకవర్గంలలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పటిన చెట్లు నాటి పెంచే కార్యక్రమం చేపట్టాగా నేటి ప్రభుత్వంలో ఎపుగా పెరిగిన చెట్లను నరికి వ్యాపారం చేసుకొనే వారు కొందరైతే పక్కనే పంట పొలాలు ఉండే రైతులు వాటిని కాల్చి పంటను సాగుచేసుకొనే పనిలో మరికొందరు ఉన్నారు. ఏది ఎమైనా హరితహారం చెట్లను కాపడితే పచ్చదనంతో పాటు ప్రకృతి మనకు నీరు నీడ మనిషికి కావాల్సిన ఆక్సీజన్ ఇస్తుంది. దీనిని ప్రతి వ్యక్తి కూడ గమనించి మన చెట్లను కాపాడటంతో పాటు అటవీ సంరాక్షన అధికారులు ప్రకృతిపరమైన చెట్లను నరికితే కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.