స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ ఆధ్వర్యంలో""బాలాజీ నగర్ లో మెగా హెల్త్ క్యాంప్

Apr 6, 2026 - 16:39
Apr 6, 2026 - 21:14
 0  12
స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ ఆధ్వర్యంలో""బాలాజీ నగర్ లో మెగా హెల్త్ క్యాంప్

స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ ఆధ్వర్యంలో

బాలాజీనగర్ లో మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు. 

ఈ మెగా హెల్త్ క్యాంపు లో మరో ముఖ్య అతిధి గా కోదాడ DSP శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 

తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి దాదాపు 500 మంది పాల్గొన్నారు... వారికి ఉచితంగా గుండెకు సంబందించిన పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి వారికి మందులను పంపిణీ చేశారు.పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నియోజకవర్గ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, పాటు బస్తీ దావఖానాలు ఏర్పాటు చేసితగు సౌకర్యాలు కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. ఈ కార్యక్రమం లో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారు, స్థానిక కౌన్సిలర్ లు చైతన్య నాయక్, ఉదయశ్రీ హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్ సైదా నాయక్, హరి ప్రసాద్, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State