స్నేహం ఒక మహా వృక్షం

Aug 2, 2026 - 11:11
 0  142
స్నేహం ఒక మహా వృక్షం

  తిరుమలగిరి 02 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ 

  ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం. కానీ తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని 2010 11 బ్యాచ్ విద్యార్థులు తమ స్నేహాన్ని ఒక వృక్షంలో ఎదుగుతూ ఉండాలని వారు చదువుకున్న బడిలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ.. భాష కందని కమ్మటి భావన చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల కుదిరింపులో విరిసిన అందమైన గులాబీ జీవితంలో మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం ఎప్పుడో చిన్నప్పుడు బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్ని అయితే పొరవల్లి తొక్క యవ్వనంలో పెను వేసుకునే అనుబంధాలు మరికొన్ని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏ కాలేజీలోనో లైబ్రరీ లోను కలిసి నడిచే తరగతి గదిలోని ఒకే బెంచ్ పై మాస్టారు బోధించే పాఠాలలోని సందేహాల్లో ఊపిరి పోసుకునే స్నేహం ఒక మహా వృక్షంలో ఎదుగుతుంది జీవితంతో మమేకమవుతుంది ఒక విడదీయరాని అనుబంధమవుతుంది ఎ స్వార్థం లేని జీవన బంధం స్నేహం జీవితంలో ఎవరున్న లేకున్నా మంచి నేస్తం అన్నారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్, పరుశురాములు ,రాజీవ్ ,ప్రవీణ్, నరేష్ ,ఉమేష్ ,మహేష్, రామ్ కుమార్, శ్రీకాంత్ ,ప్రసాద్, వెంకన్న ,నరేష్ పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి