స్థానిక సంస్థల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి ఎమ్మెల్యే

తిరుమలగిరి 03 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సూచించారు. మంగళవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజా పతినిధులు అందరూ సమన్వయంతో పనిచేసే తుంగతుర్తి గడ్డమీద మూడు రంగుల జెండాను ఎగరవేయాలని ఆయన కోరారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కేవలం సొంత స్వలాభం కోసం ఇసుక దందా భూ మాపియా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ప్రజలను భ్రయ భ్రాంతులకు గురి చేశారని అని చెప్పారు. వారు చేసిన పనులే వారిని ప్రజలు ఎన్నికల్లో బొంద పెట్టారని అని చెప్పారు. తాను శాసనసభ్యులు గా ఎన్నికైన తర్వాత నియోజకవర్గం లో ప్రశాంతత తో పాటు సుమారు వందలాది కోట్ల రూపాయలతో సి సి రోడ్లు రోడ్లు పాఠశాల భవనాలు మంచినీటి ట్యాంకులు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఎన్నో పథకాలను ప్రారంభించి శంకుస్థాపన చేశానని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించి ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని కోరారు. ఎన్నికల్లో సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు విస్తృతంగా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కే దక్కిందని అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ లతో పాటు అదనంగా ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన చెప్పారు. జిల్లా మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళుతున్నానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తిరుమలగిరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, జిల్లా నాయకులు సంకేపల్లి కొండల్ రెడ్డి, మూల రవీందర్ రెడ్డి, సుంకరి జనార్ధన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి అంబెడ్కర్, అభి షేక్ రెడ్డి, ఎర్ర యాదగిరి , శాగంటి రాములు, తుంగతుర్తి మీడియా ఇన్ఛార్జి కందుకూరు లక్ష్మయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వేణు రావు, మాజీ కౌన్సిలర్ గుగులోతు భాస్కర్ నాయక్, బత్తుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శోభారాణి, సేవాదళ్ అధ్యక్షులు యాదగిరి, మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.