స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లు విడుదల చేయాలి

తిరుమలగిరి 9 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
పెండింగులో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని, స్కాలర్షిప్లు రాక విద్యార్థుల భవిష్యత్తులు అంధకారంగా ఉన్నాయని పలు కళాశాల ల యాజమాన్యాలు తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్థుల తో మానవహారం నిర్వహించారు. గత పాలకుల విద్యార్థులను, విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని, వారి హయాంలో 8300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి ప్రజా ప్రభుత్వం గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో స్కాలర్షిప్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం విద్య వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్పు బిల్లులు రాక పై చదువులకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల భవిష్యత్తు మారడం లేదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రగతి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కొమురయ్య, డైరెక్టర్ నర్సయ్య, నరోత్తమ రెడ్డి, ఉషశ్రీ ఒకేషనల్ జూనియర్ కళాశాల యాజమాన్యం పి శ్రీనివాస్, తిరుమల సహకార జూనియర్ కళాశాల యాజమాన్యం జి హైగ్రీవమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.