సోమవారం రాత్రి జరిగిన  సంఘటన  

RTC డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రాత్రి సమయంలొ ప్రాణభయంతో తల్లి ఇద్దరు చిన్న పిల్లలు

Dec 10, 2024 - 17:10
 0  13
సోమవారం రాత్రి జరిగిన  సంఘటన   

ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు ప్రజలందరికీ చాలా ఇబ్బందుల గురవుతున్నారు

ప్రైవేటీ బస్సుల యాజమాన్యం కూడా పూర్తి బాధ్యత వహించాలి
 
జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రం నుండి ఆయిజ మధ్య తాటికుంట గ్రామ స్టేజి దగ్గర ఓ మహిళ తన ఇద్దరు 3, 6 సంవత్సరాల చిన్న పిల్లలను చేయితో పట్టుకుని భయాందోళనకు గురైంది.
వివరాలలోకి వెళితే గద్వాల నుండి ఆమె సొంత ఊరు అయినా తాటికుంట గ్రామానికి గద్వాల జిల్లా కేంద్రంలో నుండి ఆర్టీసీ TS 33 T 3006 నెంబర్ గల బస్సు ఎక్కింది ఆమె భర్త గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కడానికి సిద్దంగా ఉన్నాడు, ఆమె (ప్రయాణికురాలు)  బస్ డ్రైవర్ తో సార్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కడం కోసం మా వాళ్ళు ఉన్నారు  దయచేసి బస్సు ఆపండి సార్  అని ముందుగానే బస్సు డ్రైవర్ కు తెలియజేయడం జరిగింది.
ఆ బస్సు డ్రైవర్ హాస్పిటల్ దగ్గర బస్సు ఆపకపోవడంతో సార్ ఇక్కడ మా వాళ్లు బస్సు ఎక్కడానికి ఉన్నారు బస్సు ఆపండి నేను అయిన బస్సు దిగుతా సార్ అని కేకలు వేసిన వినిపించుకోకుండా బస్సు ముందుకి వెళ్లడంతో ఆ బస్సు కండక్టర్ ను అడగగా  నేనేం చేయలేనని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ప్రయాణికురాలు చేసేదేమి లేక ఆమె సొంత ఊరైన తాటికుంట స్టేజి దగ్గర బస్సు దిగింది.

అసలే ఆ స్టేజ్ నుండీ తాటికుంట గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల చిన్న పిల్లలతో అన్నా తల్లి భయాందోళనకు గురవుతుంది. దయచేసి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.  ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి మహిళలకు ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.

 వివరణ. పై విషయంపై గద్వాల డిపో మేనేజర్ కు తెలంగాణ వార్త రిపోర్టర్గా చాలా సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వట్లేదు ఇప్పటికైనా మేనేజర్ కానీ సిబ్బంది కానీ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని రిపోర్టర్గా నా విజ్ఞప్తి.

 మాయదారి ఓట్ల అధికారం  దోపిడి రాజకీయ వ్యవస్థ అవసరాల కోసం స్వార్థ రాజకీయ  పార్టీ కోసం  ప్రజలను రాత్రి పగలు మహిళను అందరిని రకరకాల సందర్భాలు  ఇబ్బందులకు గురవుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333