అనాధ పిల్లలకు అండగా నిలిచిన హైదరాబాద్ వాస్తవ్యులు

జోగులాంబ గద్వాల 17 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: మల్ధకల్ మండల పరిధిలోని చర్ల గార్లపాడు గ్రామంలో వీరేశ్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాధలుగా మారారు. వారు అనాధలు కాదు మేమున్నామని అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఈదన్న గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన వారిచే రూ.56వేల నగదు,50 కిలోల బియ్యం అందజేసి వారికి తోడుగా నిలిచారు. వారిని ఆర్థికంగా ఆదుకున్న వారిలో మహేష్ కాగడా 2100, శివరాం 2100, రాకేష్ గౌడ్ 2000, సునీల్ కుమార్ 2100, శ్రీనివాసులు 2100, కానిస్టేబుల్ నరేష్ 3వేలు, అసద్ ఖాన్ 5000, నాగమల్లేశ్వరరావు 5000, అభినవ్ కొటారి 5000, యాదగిరి 5000, శ్రావణ్ 5000, లక్ష్మారెడ్డి 5000, ఎం శ్రీను 2000, రాకేష్ 50 కిలోల రైస్, పూణే గోపి 5000, బాలరాజు 2100 అందజేశారు.