**సోదర భావంతో మంత్రికి రాఖీలు""ఖమ్మం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో*

Aug 9, 2025 - 18:37
 0  40
**సోదర భావంతో మంత్రికి రాఖీలు""ఖమ్మం పొంగులేటి క్యాంపు కార్యాలయంలో*

*సోదర భావంతో మంత్రికి రాఖీలు*

తెలంగాణ వార్త ప్రతినిధి...రా వెళ్ళ.  ఖమ్మం: శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణంలో మెరిసింది.వివిధ హోదాల్లో ఉన్న మహిళలు,గృహిణులు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సోదర భావంతో రాఖీలు కట్టి శుభాకాంక్షలు అందించారు.మీరు మా సోదరుడు మాత్రమే కాదు… మా కుటుంబానికి అండ” అని పలువురు మహిళలు హృదయపూర్వకంగా పేర్కొన్నారు. మంత్రి కూడా స్నేహపూర్వకంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుభకార్యక్రమాలకు హాజరైన మంత్రి, అక్కడ కూడా మహిళల నుంచి రాఖీలు కట్టించుకున్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State