సెప్టెంబర్ 1 లోగా ధ్రువపత్రాలు ఇవ్వాలి ఎంపీడీవో
జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలంలో గోపాల్ దిన్నె మొగల రావులచెరువు పంచాయతీలో గురువారము ఎస్ఐఆర్ ప్రక్రియపై గ్రామసభలు నిర్వహించారు. ఎంపీడీవో రమాదేవి పాల్గొని వారు మాట్లాడుతూ మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసులు అందించిన తర్వాత సెప్టెంబర్ 1 లోగా సరైన ధ్రువపత్రాలు సంబంధిత బిఎల్ఓ లకు అందజేయాలని సూచించారు. గడువులోగా పత్రాలు సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి సర్పంచులు ఉప సర్పంచ్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జిపిఏఓలో బిఎల్వోలు బిఎల్ఎ లు వార్డ్ మెంబర్లు తదితరులు ఉన్నారు.