సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలంటూ నెమ్మికల్ లో అఖిల పక్షాల రాస్తారోకో
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలంటూ నెమ్మికల్ లో అఖిల పక్షాల రాస్తారోకో.. శంషాబాద్ నుండి చెన్నైకి వెళ్లే బుల్లెట్ ట్రైన్ ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యాపేట మీదుగా కొనసాగించాలంటూ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారి పై మంగళవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలవ్మెంట్ మార్చుట లో జరిగిన కుట్రలను ఖండిస్తున్నామని బుల్లెట్ రైలు సాధించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని సుమారు గంటసేపు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ కార్యక్రమం లో అఖిల పక్షాల నాయకులుతూడి నర్సింహా రావు, అవిరే అప్పయ్య నర్సిరెడ్డి,జర్నలిస్ట్ లు భూపతి రాములు, మల్లేష్,గోవర్ధన్ కృష్ణ రాము, సైదులు రిటైర్డ్ డి ఎం బయ్య మల్లికార్జున్ నాయకులు బత్తుల ప్రసాద్,దండ వెంకట్ రెడ్డి, గుండు రమేష్,బెల్లం కొండ యాదగిరి, గుంశావాలి ప్రశాంత్ రామనర్సు గుండు రమేష్, కన్నయ్య,పందిరి మాదవరెడ్డి,నల్లగొండ నాగయ్య దానియెల్,సుందరయ్య కంచర్ల నర్సక్క,బాలాజీ,రాంరెడ్డి, నాగరాజు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు