సూర్యాపేట ఫ్రెష్ బ్రాండ్ ను క్రియేట్ చేద్దాం

Apr 24, 2026 - 16:25
Apr 24, 2026 - 16:26
 0  1
సూర్యాపేట ఫ్రెష్ బ్రాండ్ ను క్రియేట్ చేద్దాం

ఆయిల్‌ పామ్‌, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలి

తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలి

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థికంగా ఎదగొచ్చు

పంట మార్కెట్ చేసుకోడానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుందాం

త్వరలో 15 ఎకరాలలో మామిడి మార్కెట్ ను ఏర్పాటు చేసుకోబోతున్నాం

రేవంతన్న, ఉత్తమన్న, తుమ్మల నాగేశ్వరరావు, రఘువీర్ రెడ్డి సహకారంతో ముందుకు పోదాం

ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన సదస్సులో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.

రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడిచే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బాంకెట్ హాల్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. 

సూర్యపేట,  24 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న కూలీల కొరత, నేటి లభ్యత కారణంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే రైతుల కోసం ఎన్ ఎం ఈ ఓ - ఓ పి పథకం  కింద మొక్కలు,  ఎరువులు,  అంతర పంట సాగు బిందు సేద్య పరికరాల ఏర్పాటు కోసం మొదటి నాలుగు సంవత్సరాల కాలంలో 50 వేల 918 రూపాయలు రాయితీ కింద ఇస్తుందన్నారు. 

మొక్కల కోసం రైతు తన వాటా కింద ఒప్పో మొక్కకు 20 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుందని బిందు సేద్య పరికరాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలను అనుసరించి రైతు తన వాటా చెల్లించాలని అన్నారు. జిల్లాకు కేటాయించిన ఆయిల్ పంప్ కంపెనీలు నర్సరీ పెంచి రైతులకు మొక్కలు సరఫరా చేసి రైతులకు తగు సాంకేతిక సలహాలు ఇవ్వడంతో పాటు జిల్లా పరిధిలో ఆయిల్ ఫామ్ మిల్లును ఏర్పాటు చేసి ప్రతినెల ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల దగ్గర నుంచి ఆయిల్ ఫామ్ గెలలు కొనుగోలు చేసి 14 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.

తుంగతుర్తి లోని స్వంత వ్యవసాయ క్షేత్రంలో 25 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు.

బట్టి రైతులు ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఆయిల్ఫామ్ సాగును ఎంచుకొని ఆర్థికంగా బలపడాలని కోరారు.

పంట మార్కెట్ చేసుకోడానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకుందాం

 త్వరలో 15 ఎకరాలలో మామిడి మార్కెట్ ను ఏర్పాటు చేసుకోబోతున్నాం

కోటపహాడ్ గ్రామానికి వెళ్ళినప్పుడు రైతుల కోరిక మేరకు మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు

2012 నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ హయత్ నగర్ లో మా అమ్మ పేరు మీద డైరీ ఫామ్ నడుపుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగా రెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్సూర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, ధారవత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, ఆయిల్ ఫెడ్ ఇంచార్జి అలీం, కెవికే సీనియర్ హెడ్ డాక్టర్ నరేష్, కెవికే సీనియర్ సైటిష్ట్ నరేష్, ఇఫ్కో మేనేజర్ వెంకటేష్, జేకే పేపర్స్ మేనేజర్ రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333