ఇన్స్యూరెన్స్ చెక్ అందించిన జిల్లా ఎస్పి నరసింహ

Apr 24, 2026 - 15:57
Apr 24, 2026 - 16:00
 0  1
ఇన్స్యూరెన్స్ చెక్ అందించిన జిల్లా ఎస్పి నరసింహ

పోలీస్ సాలరీ ప్యాకేజీ SBI బ్యాంక్ అంకౌంట్ ఇన్స్యూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్. 

సూర్యపేట,  24 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- జిల్లా పోలీసు శాఖ నందు పని చేస్తూ అకాలంగ మరణించిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంభానికి 10 లక్షల రూపాయల సాలరీ  ప్యాకేజ్ SBI ఇన్స్యూరెన్స్ చెక్ ను ఈరోజు జిల్లా ఎస్పి నరసింహ తన కార్యాలయం నందు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పోలీసు లకు ప్రత్యేక సాలరీ ప్యాకేజీ ఇవ్వడం జరిగినది. పోలీసు సిబ్బంది మరణించిన క్రమంలో ఈ పోలీస్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ద్వారా  10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. ఈ స్కీం ద్వారా ఈరోజు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేయడం జరిగినది అని, ఈ స్కీం పోలీసు కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక బాసటగా నిలుస్తుంది అని ఎస్పి అన్నారు. సిబ్బంది అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీసు సిబ్బంది సాలరీ ప్యాకేజ్ అకౌంట్ గా మార్పు చేసుకోవాలని సూచించారు. ఈ స్కీం ను రూపొందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి అభినందనలు తెలిపినారు. 

ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AO మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్ఐ రామచందర్ గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు మోహన్ కుమార్, మహేష్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333