సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

Apr 14, 2026 - 22:27
 0  7
సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.పలువురు మీడియా ప్రతినిధుల సమక్షంలో మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది .

.ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు,మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు .. బొజ్జ ఎడ్వర్డ్, గుణగంటి సురేష్ గౌడ్, బుక్క రాంబాబు,ఊటుకూరి రవీందర్ లు వెల్లడించారు.

 ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా వజ్జే వీరయ్య(మన తెలంగాణ)ప్రధాన కార్యదర్శిగా ఐతగాని రాంబాబు(10 టివి),కోశాధికారిగా తల్లాడ చందన్(జె న్యూస్ ఎడిటర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 ప్రెస్ క్లబ్ పూర్తి స్థాయి కమిటీని రేపు బుధవారం ప్రకటించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

 ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు మిక్కిలినేని శ్రీనివాస్ రావు (ఆంధ్రజ్యోతి (,షేక్ జహంగీర్ (నవ తెలంగాణ),చల్లా చంద్రశేఖర్ (Tv 9), రాపర్తి మహేష్ గౌడ్ (ఆంధ్రప్రభ),చెవగాని నరేందర్ (సూర్య) స్టాఫ్ రిపోర్టర్లు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333