దివ్య క్షేత్రంభద్రాచలం, అంబేద్కర్ సెంటర్లో ఘనంగా జరిగిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు

Apr 14, 2026 - 20:18
 0  1

తెలంగాణ వార్తఏప్రిల్ 14 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలం అంబేద్కర్ కూడలి వద్ద భారత రాజ్యాంగ నిర్మాత,  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి135 వ జయంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం. వెంకట్రావు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్  చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య, సర్పంచి పూ నెం. కృష్ణ, ఉప సర్పంచ్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పరిమి. శ్రీనివాసరావు మొదలగు వారు కాంగ్రెస్ పార్టీ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. టిఆర్ఎస్ పార్టీ నుండి జిల్లా లీడర్.మానె. రామకృష్ణ, ప్రబోధ్ కుమార్, కె. సాయిబాబా, వార్డ్ మెంబర్ కావూరి. గోపి , పట్టణ ప్రముఖులు తుమ్మలపల్లి. ధనేశ్వరరావు, సీతా మహాలక్ష్మి మొదలగువారు బడుగు బలహీన వర్గాల వారికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాల వారు కూడా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ, అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఏ ఎస్ పి పాల్గొని అంబేద్కర్ సేవలను ప్రస్తుతించారు,  భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల. రవికుమార్ భారత ప్రజలకు స్వర్గీయ అంబేడ్కర్ చేసిన సేవలు, కల్పించిన రాజ్యాంగ హక్కుల వల్లనే నేటి సమాజంలో ప్రతిభారతీయపౌరునికి సమాజంలో గౌరవం లభిస్తోందని తెలియజేస్తూ, భారతరత్న అంబేద్కర్ మహాశయునికి ఘనంగా నివాళులు సమర్పించారు. 
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333