సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి
18వ వర్ధంతి సందర్భంగా వామపక్ష పార్టీల డిమాండ్
సూర్యాపేట 09 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎం సి పి ఐ యు పోలీట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ భీమీరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బియన్ రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ బి ఎన్ రెడ్డి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం సామాజిక న్యాయం కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేశారని ఆనాడు సాయుధ పోరాటంలో భూమి బుక్తి విముక్తి కోసం ఎర్రజెండ చేతబట్టి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర భీమిరెడ్డి గారిదన్ని కమ్యూనిస్టుల ఐక్యత కోసం నిరంతరం పోరాడారని వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని కమ్యూనిస్టులు ఐక్యం కావలసిన అవసరం ఉన్నదని వారు చేసిన పోరాటాలకు వేదికగా ఉన్న ఈ సూర్యాపేట జిల్లాకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును నామకరణం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ అధికార ప్రతినిధి బుద్ధ సత్యనారాయణ సిపిఐ నాయకులు శ్యామల అశోక్, ఎం సి పి ఐ యు జిల్లా నాయకులు నక్క శ్రీనివాస్ లింగంపల్లి ఓంకార్ లింగంపల్లి రాజు శ్రీరామోజు ఉమేష్ నూక పొంగు వైభవ్ తదితరులు పాల్గొన్నారు