సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ

Jun 19, 2026 - 22:48
Jun 19, 2026 - 22:50
 0  2
సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దుతాం.

పట్టణంలో అదనంగా మరో 20 సీసీ కెమెరాల ఏర్పాటు.. కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం

భూకబ్జాదారులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా..

ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ఆపరేషన్ రోప్.

మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత.. వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు.

ఫిర్యాదులపై తక్షణ స్పందన.. బాధితుల ఇళ్లకు వెళ్లి కేసులు నమోదు, స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేదు.

సూర్యాపేట, 20 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీ కి డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్సైలు మరియు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి, గౌరవ వందనంతో స్వాగతం తెలిపినారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన కవాతును పరిశీలించిన ఎస్పీ, వారి యూనిఫామ్స్ మరియు కిట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, స్టేషన్‌లోని వివిధ రకాల కీలక రికార్డులను, శాంతిభద్రతల నిర్వహణ ఫైళ్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పిర్యాదులు, కేసులు పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పూర్తి చేయాలి, కోర్టులతో సమన్వయంగా పని చేసి ఎక్కువ కేసుల్లో శిక్షలు అమలయ్యేలా కృషి చేయాలని అన్నారు. బాధితులకు రక్షణ, భద్రత కల్పించడం ప్రాథమిక విధి, బాధ్యత అన్నారు. సిబంది విధులను పర్యవేక్షణ చేయాలి సమర్థవంతంగా పని చేసేలా నైపుణ్యాలను వృద్ధి చేయాలను అన్నారు. జిల్లా కేంద్రంలో అప్రమత్తంగా ఉంటూ నేరాలను పటిష్టంగా నిరోధించాలని అన్నారు, 

20 సీసీ కెమెరాల ప్రారంభం:

ప్రజల రక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరో 20 సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. వీటిని తక్షణమే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని అత్యంత సురక్షిత పట్టణంగా మార్చడమే మా ప్రాధాన్యత. ముఖ్యంగా మహిళల, విద్యార్థినుల భద్రతకు మేము అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. మహిళలను వేధించే వారిపై, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభమైనందున, విద్యార్థినుల భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.  పోలీస్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజల నుండి ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే కేసులు నమోదు చేసి తక్షణ సహాయం అందిస్తున్నాం. దీనివల్ల బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దకే పోలీసు సేవలను చేరవేస్తున్నాం." ప్రజలకు ఇబ్బందులు కలిగించే రౌడీషీటర్లు, భూకబ్జాదారులు, చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై పూర్తిస్థాయి నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక నివారణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నాం."

ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఎస్సైలు ఏడు కొండలు, మహేందర్, శివతేజ, సందీప్, వెంకన్న, రహిముద్దీన, ఏఎస్సై శంకర్,  మరియు స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్,  డిసిఆర్బి సిబంది ఎస్ఐ యాకూబ్, ఏఎస్ఐ అంజన్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రెడ్డి, సీసీ సందీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333