సూర్యాపేటలో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం: రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి,వేణారెడ్డ

Jan 27, 2026 - 06:02
Jan 27, 2026 - 13:46
 0  4

తెలంగాణ వార్త సూర్యపేట 26-01-26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు స్వంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా భవన నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మున్సిపాలిటీ భవనంలో సూర్యాపేట ప్రెస్‌క్లబ్ కార్యాలయాని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రావు అధ్యక్షతన ప్రారంభించారు.

ఈ సందర్భంగా రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వేణారెడ్డి మాట్లాడుతూ—సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసేది జర్నలిస్టులేనని కొనియాడారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో మీడియా పాత్ర అమూల్యమన్నారు. గతంలో రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి జర్నలిస్టుల సమస్యలను గమనించి వారికి గృహనిర్మాణం కోసం ఇంటి స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ స్ఫూర్తితోనే నేడు ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి కూడా అందరి సహకారంతో ముందడుగు వేస్తామన్నారు.

జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగితే ప్రెస్‌క్లబ్ నిర్మాణం మరింత వేగంగా సాధ్యమవుతుందని చెప్పారు. వార్తల రచనలో మంచి విషయాలను మంచిగా, చెడును చెడుగా చూపించడం తప్పుకాదని, అయితే సమాజాన్ని నిర్మించే సానుకూల అంశాలను కూడా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.  

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పది సంవత్సరాల క్రితమే స్థలం కేటాయించామన్నారు. అవసరమైన స్థలం, అనుమతులు, వనరుల సమీకరణలో తమవంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు పాత్రికేయులతో మేధోమథనం ఏర్పాటుచేస్తామని మా మానిఫెస్టో ను ప్రజలముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, చకిలం రాజేశ్వరరావు, అంజద్ అలీ, కెక్కిరేని శ్రీనివాస్, పూర్వ విద్యార్థుల మిత్ర మండలి అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు సుంకరబోయిన వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కందుకూరి యాదగిరి, సీనియర్ జర్నలిస్టులు బంటు కృష్ణ, అయితగాని రాంబాబు, మొయినుద్దీన్, భూపతి రాములు, గుంటూరు సంతోష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136