సీఎం వ్యాఖ్యానాలపై టిఆర్ఎస్ నేతల ఆగ్రహం

Jul 15, 2025 - 18:57
Jul 15, 2025 - 19:02
 0  11
సీఎం వ్యాఖ్యానాలపై టిఆర్ఎస్ నేతల ఆగ్రహం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :  తిరుమలగిరిలో సీఎం వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల అగ్రహం..తిరుమలగిరి సభలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం *ఆత్మకూరు యెస్ మండల* *నాయకుల ఆగ్రహం.* ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనం ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వరుసగా 8 పంటలకు సాగునీరు అందించిన ఘనత జగదీష్ రెడ్డి సీఎం చేసిన వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయం బిఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములలో సైతం జాలుపారి జమ్మి పుట్టిన విషయం వాస్తవం కాదా? ఎస్సారెస్పీ ఆయకట్టు నీటి విడుదల పై హమీ ఇవ్వేలేని చేతగాని తనం కాంగ్రెస్ ప్రభుత్వానిది - తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారహీన మనస్తత్వానికి నిదర్శనం.ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆయన కుసంస్కారాన్ని ప్రతిబింబిస్తున్నాయి. "ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వరుసగా 8 పంటలకు సాగునీరు ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డి గారిదే," ఈ విషయం ఆయకట్టు పరిధిలో పాలు తాగే పిల్లవాడిని అడిగినా చెప్తారు."సొంత మండలాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకునే స్వార్థపరుడు జగదీష్ రెడ్డి కాదు" ఆయన హయాంలో జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిందన్న విషయం మీరు మర్చిపోయినా, జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు. "బిఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములలో కూడా నీరు జాలుగా పొంగిపొర్లింది – ఇది ప్రజలకు తెలుసు". ఎటువంటి స్వార్థం లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లిన ఖ్యాతి జగదీష్ రెడ్డి గారిది. ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఎటువంటి ప్రకటన చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు గ్రహించారు . ఈ విషయం మీటింగ్లో ఉన్న ఇంటలిజెన్స్ అధికారులు అడిగితే తెలుస్తది.సీఎం చేసిన వ్యాఖ్యల వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయం . అంతేకాదు, "బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తిరగలేరు". తాను ముఖ్యమంత్రిని అని మరచిపోయి ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మౌలిక చైతన్యాన్ని అవమానించేలా ఉన్నాయి. నీటి ప్రాజెక్టులపై మాట్లాడే ముందు, గతంలో ఎవరి హయాంలో ప్రాజెక్టులు పూర్తి అయ్యాయో తెలుసుకోవాలి" .రేవంత్ రెడ్డి మాటల కన్నా, జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది తెలుసుకోవాలని మండల నాయకులు ఆగ్రహ వ్యక్తం చేసినారు ఈ సమావేశములో మండల పార్టీ అధ్యక్షుడు తుడి నరసింహారావు జిల్లా నాయకులు మ ర్ల చంద్రారెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి కసగాని బ్రహ్మం గౌడ్ బెల్లంకొండ యాదగిరి గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్ మాజీ ఎంపిటిసి మిర్యాల వెంకట్ రెడ్డి రంగారెడ్డి గునిగంటి భిక్షం తిరుమలేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు