ఈ నెల 22 వికలాంగుల సభను విజయవంతం చేయాలి

- ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ
అడ్డగూడూరు15 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రంలో వికలాంగుల మరియు వృద్ధుల పెన్షన్ పెంపు కొరకై ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ బిర్రు మహేందర్ మాదిగ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈనెల 22వ తారీఖున భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు 6వేలు మరియు వృద్ధుల వితంతులకు 4వేల పెన్షన్ పెంచాలని డిమాండ్ తో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు గజ్జెల్లి యాదగిరి ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ అధికార ప్రతినిధి పనుమటి సతీష్ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోడ యాదగిరి మాజీ మండల అధ్యక్షులు గజ్జెల్లీ రవి సీనియర్ నాయకులు బాలెంల రాజు,పోలేపాక అబ్బులు,బాలెంల అయోధ్య,బాలెంల రామక్రిష్ణ,బాలెంల బుచ్చిమల్లు, గజ్జెల్లి క్రిష్ణ,గూడెపు సురేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కంబాల బద్రి, కడారి యాదగిరి,గూడెపు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.