**భగత్ సింగ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న""బిజెపి మోడీ*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: - భగత్ సింగ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ మోడీ.
- భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలి.
- డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ డిమాండ్.
- భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా యస్.యఫ్.ఐ,డి.వై.యఫ్.ఐ వర్ధంతి సభ.
(మార్చి 23,2025): దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచిపోసిస్తు భగత్ సింగ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనీ వెంటనే
భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలనీ డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్ డిమాండ్ చేశారు.
భగత్ సింగ్, రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మారక వారోత్సవాలలో భాగంగా స్థానిక తనికెళ్ళలోని యస్.సి బాలుర వసతి గృహంలో వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది.ఈ వర్ధంతి సభలో ఆయన అతిదిగా పాల్గొని మాట్లాడుతూ నేటి విద్యార్దులు,యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని,వాటిని అధిగమించి సేవా కార్యక్రమాలు క్రీడా రంగాల్లో ముందుండాలనీ వారు అన్నారు.విద్యార్థులను యువతులను చైతన్యపరచడంలో భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ముందుంటుందనీ ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచిపోసిస్తు భగత్ సింగ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారనీ, బీజేపీ కి మోడీకి నిజమైన దేశ భక్తి ఉంటే వెంటనే
భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలనీ ఆయన డిమాండ్ చేశాడు.ఈ కార్యక్రమంలో యస్.యఫ్.ఐ జిల్లా నాయకులు మనోజ్,లోకేష్,నాగరాజు, సుప్రియ,మేఘన,రాజు తదితరులు పాల్గొన్నారు.