సిబ్బంది కొరత అందని చికిత్స.

Aug 11, 2026 - 16:02
 0  15
సిబ్బంది కొరత అందని చికిత్స.

జోగులాంబ గద్వాల 11 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండలంలో 29 గ్రామాలలో సుమారు 50 వేల జనాభా ఉన్న ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంది. అందులోనూ సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తున్నప్పటికీ వారికి అవసరమైన స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది లేరు, దీంతో వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రక్త పరీక్షలు జరిగిన స్థితి. కేవలం వైద్యులే కాకుండా ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ అటెండర్ పోస్ట్ సైతం ఖాళీగా ఉండడంతో రోగులకు సకాలంలో చికిత్సలతో పాటు రక్త పరీక్షలు జరగడం లేదు, మందల పంపిణీ కౌంటర్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న అరకొర సిబ్బందిపై అదనపు విధులు భారం పడడంతో వారు సైతం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామన్నారు. మండలంలోని గర్భిణీ స్త్రీలు డెలివరీల  సమయంలో స్టాఫ్ నర్స్ పురుషులు ఉండటం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని గర్భిణీ స్త్రీల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అందాజా గత సంవత్సరం నుంచి ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్య తగ్గిందని ఆరోపణలు ఉన్నాయి.? స్వీపర్ మరియు వాచ్మెన్ కూడా లేరు గత 20 రోజుల క్రితం డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్ మై ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. 
 
24 గంటలు సేవలందించాలి ఇటిక్యాల సర్పంచ్ జీవన్ రెడ్డి .

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిత్యం 24 గంటలు సేవలు అందించాలి. రాత్రిల్లో అత్యవసర సమయాల్లో గర్భిణీ స్త్రీలు రోడ్డు ప్రమాద క్షేత్ర గాత్రులు  సిబ్బంది కొరతతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు.? ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు స్పందించాలని జీవన్ రెడ్డి కోరారు. స్టాఫ్ నర్స్ పురుషులు ఉండడం వల్ల డెలివరీ ల సంఖ్య కూడా చాలా తగ్గిందని  వారి స్థానంలో స్టాఫ్ నర్స్ గా మహిళలను నియమించాలని సర్పంచ్ జీవన్ రెడ్డి  డిఎంహెచ్వోను కోరడం జరిగింది. డిఎంహెచ్వో సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. . కానీ 20 రోజులు అవుతున్నా కానీ కిందిస్థాయి సిబ్బంది అమలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీల సంఖ్య పెరిగే విధంగా చూడాలని అధికారులను మండలంలోని గర్భిణీ స్త్రీలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333