దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత రాజీవ్ గాంధీ : సుంకరి జనార్ధన్

Aug 20, 2026 - 21:59
 0  1
దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత రాజీవ్ గాంధీ : సుంకరి జనార్ధన్

తిరుమలగిరి 21 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82 వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి జనార్ధన్ వారి చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు దేశం ఆర్థికంగా,శాస్త్ర,సాంకేతికంగా పురోగమించడానికి రాజీవ్ గాంధీ కృషి చేశాడని కొనియాడారు టెలిఫోన్,కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక రంగాలను భారత్ లో ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి పాటుపడిన గొప్ప నేత అని అన్నారు.21 సంవత్సరాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు చేసి యువతను దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. దేశం కోసం బలి ధనం చేసిన రాజీవ్ గాంధీని దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు...

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు స్రవంతి నరేష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్ తిరుమలగిరి టౌన్ ప్రెసిడెంట్  పేరాల వీరేష్, కందుకూరి లక్ష్మయ్య తిరుమలగిరి మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తిరుమణి యాదగిరి బత్తుల శ్రీను  మాజీ కౌన్సిలర్లు..వార్డు ఇన్చార్జులు..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు.గ్రామ శాఖ అధ్యక్షులు.మండల కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, మరియు ఇతర అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, మాజీ ఎంపిటిసి లు,, యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.....

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి