సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Sep 23, 2024 - 20:12
Sep 24, 2024 - 08:30
 0  2
సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

షీ టీమ్స్ పై అవగాహన

 సూర్యాపేట టౌన్ PS పరిది.

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ SI  నీలిమ  పట్టణం లోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్ పైన, సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.

సూర్యాపేట షి టీమ్స్ మహిళా SI నీలిమ మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్  అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో, వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు 

యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు

మహిళల రక్షణ పై పటిష్టంగా పనిచేస్తున్నామని మహిళలను ఆడపిల్లలను గౌరవించాలని తెలియజేశారు అదేవిధంగా 

 టీ సేఫ్ యాప్ గురించి విద్యార్థినిలకు వివరించారు.

అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు..

ఈ కార్యక్రమం నందు కాలేజీ ప్రిన్సిపల్ రాణి, షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి, భరోసా సెంటర్ మౌనిక, శృతి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223