సావిత్రి భాయి పూలే ఆశయ స్ఫూర్తి నీ కొనసాగించాలి.

Jan 3, 2025 - 20:58
Jan 3, 2025 - 21:00
 0  1
సావిత్రి భాయి పూలే ఆశయ స్ఫూర్తి నీ కొనసాగించాలి.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరపడం హర్షనీయం 

సూర్యపేట 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే ఆశయస్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి లు పిలుపునిచ్చారు. ఈ రోజు కెవిపిఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఎం వి యన్ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ శూద్రులు, అస్పశ్యులు చదివితే నాలుకలు కోయాలనీ, పాఠాలు వింటే చెవుల్లో సీసం పోయాలనే మానసిక చట్టాలను మట్టిలో పాతిపెట్టిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని అన్నారు. మను వాదుల విషమ షరతులను తన కాలిగోటికి కట్టేసి అనేక అవమానాలను, ఛీత్కారాలను భరించి పేదలకు, మహిళలకు చదువు నేర్పిన ధీరవనిత అని కొనియాడారు.శూద్రులు విద్య నేర్చుకోవడం సహజమైన హక్కని, అందరూ చదవాలనీ.. అందరూ అసమానతలు లేకుండా బతకాలని పరితపించిన స్ఫూర్తిప్రదాత అని అన్నారు. సావిత్రిబాయి పూలే గొప్ప ఉద్యమకారిణి, రచయిత్రి, మంచివక్త, కులంపై కలంతో యుద్ధం నడిపిన కవయిత్రి.స్త్రీ, పురుష సమానత్వం కోసం సాగిన ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కులం, పురుషాధిక్య, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక మహిళ ఉద్యమకారిణి ఆమె అని అన్నారు.బ్రహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్న ఆధిపత్య భావజాలానికి ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో ఆమె పీడితుల పక్షాల అగ్రగామిగా నిలిచారనీ తెలిపారు. సత్యశోధక్‌ సమ
భారతీయు లందరికీ సమాన ఉన్నత విద్య అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కానీ నేడు దేశాన్ని కార్పొరేట్‌ శక్తులు ఏలుతున్నాయని అన్నారు. విద్య పేదలకు అందే పరిస్థితి లేదని సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్య అందరికీ అందే వరకు పోరాడుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం గా జరపడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు టీపిటీఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ జే నరసింహారావు నాయకులు చినపంగి నరసయ్య, శ్రీనివాస్, మార్క్,లింగన్న,వెంకన్న, రాములు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333