సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి, దోపిడిలేని సమాజాన్ని కోరిన

వేగుచుక్క భగత్ సింగ్ పి డి ఎస్ యు,పి వై ఎల్

Mar 30, 2024 - 15:12
Mar 30, 2024 - 21:08
 0  28
సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి, దోపిడిలేని సమాజాన్ని కోరిన

తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:-.సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి, దోపిడిలేని సమాజాన్ని కోరిన వేగుచుక్క భగత్ సింగ్ పి డి ఎస్ యు,పి వై ఎల్ స్వాతంత్రమంటే పాలకులు మారడం కాదు, సమాజంలో అసమానతలు పోయి, ప్రతి మనిషీ స్వేచ్ఛగా బతకడం అని చెప్పిన భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం పోరాడాల్సిన అవసరం నేటి విద్యార్థి,యువతరం మీద ఉందని సి పి ఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ మండారి డేవిడ్ కుమార్ అన్నారు. భారత స్వాతంత్ర్య సమర యోధులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు (ఎస్ ) మండలం ఏపూర్ గ్రామం లో సి పి ఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీసులో వర్ధంతి సభ ను *పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి అధ్యక్షత* వహించగా, ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. *ఈ సందర్భంగా సి పి ఐ (ఎం_ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.* 23 ఏళ్ల వయసులో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించదన్నారు.భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి తన కుటుంబం దేశభక్తితో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఢిల్లీ పార్లమెంట్ లో పొగ బాంబులు విసిరి బ్రిటిష్ వారు చేయబోతున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్న ఆమోద సభలో కరపత్రాలు పంచారు. తప్పించుకునే అవకాశం ఉన్న కూడా గుండె ధైర్యంతో నిలబడి అరెస్ట్ అయినారు. జైల్లోకి పంపించినాక జైల్లో ఉండి అనేక రచనలు,కవితలు, వ్యాసాలు వ్రాసారు .భారత రాజకీయ ఖైదీలకు,బ్రిటిష్ ఖైదీలకు సమాన హక్కులు ఉండాలని, పౌస్టికరమైన ఆహారం అందించాలని 68 రోజుల నిరసనగా దీక్ష కొనసాగించి హక్కులు సాధించాడు. అతి చిన్న వయసులో దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహానీయుడని కొనియాడారు. దేశంలో కార్మిక హక్కుల కోసం, రష్యా విప్లవ నాయకుడు కామ్రేడ్ లెనిన్ నడిపించిన వర్గ పోరాటలతో తను చైతన్యం పొందాడు. స్వతంత్ర ఉద్యమంలో సురుగ్గా పాల్గొని యువతరాన్ని కదిలించాడు. తను అమరత్వం పొంది 93 సంవత్సరాలు అయినా కూడా దేశ ప్రజల హృదయాల్లో రియల్ హీరోగా దేశ చరిత్రలో నిలిచిపోయాడు.ఆ విదంగా దోపిడీ పీడన లేని నూతన సమాజం కోసం యువతరం,ప్రజలూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. *ఈ సభలో ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, అరుణోదయ జిల్లా కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు ఎస్ కె జిలేరు, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ నాగయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోదు మధు, పి డి ఎస్ యు జిల్లా డివిజన్ అధ్యక్షులు పిడమర్తి భరత్,అరుణోదయ డివిజన్ కార్యదర్శి ఎర్ర ఉమేష్,అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బోల్లే వెంకన్న, పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు మున్నా అశోక్,పి డి ఎస్ యు మాజీ డివిజన్ కార్యదర్శి బొల్క పవన్,పార్టీ గ్రామ కార్యదర్శి సుదగాని వెంకన్న, సబ్ డివిజన్ నాయకులు బత్తిని ఎల్లయ్య,సంజీవ రెడ్డి, వీరబోయిన ఎర్రయ్య, వీరబోయిన లింగయ్య, కుంట రవి, దడిగెల లింగయ్య,ఎస్కే మైబెల్లి,,ఎస్కే రహీం, మిర్యల రమేష్,మాచిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.*