సామెల్ కు మంత్రి పదవి ఇవ్వాలి. కన్నెబోయిన మల్లయ్య

తిరుమలగిరి 30 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ ఉద్యమ నాయకుడు, తుంగతుర్తి నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి ఏ ఎమ్మెల్యే కు కూడా రాని అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిచిన తుంగతుర్తి నియోజకవర్గ స్థానిక నాయకుడైన ఎమ్మెల్యే మందుల సామెల్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కన్నబోయిన మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ దళిత సామాజిక వర్గం నుంచి గెలుపొందిన మందుల సామెల్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, ఇది రానున్న రోజుల్లో తుంగతుర్తిని బలమైన కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు గా మార్చడంలో ఎంతో ఉపయోగపడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆశపడుతున్నారన్నారు.