సామాజిక వైద్యశాల వెంకటాపురం నందు రెడ్ రిబ్బన్ ర్యాలీ
సామాజిక వైద్యశాల వెంకటాపురం నందు రెడ్ రిబ్బన్ ర్యాలీ
తెలంగాణ వార్త ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో వైద్య ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా గురువారం సామాజిక వైద్యశాల వెంకటాపురం నందు రెడ్ రిబ్బన్ ర్యాలీ, హెచ్ఐవి, ఏఐడీఎస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో డాక్టర్ శివాజీ మాట్లాడుతూ ఈ రోజు మనం హెచ్ఐవి, ఏఐడీఎస్ గురించి ప్రజలలో అవగాహన పెంచడం చాలా ముఖ్యమైన విషయమని,హెచ్ఐవి ఒక సంక్రమణ వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చునన్నారు. ఈ వ్యాధి ప్రధానంగా రక్షణ లేని లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తం, తల్లి నుంచి శిశువుకు వ్యాప్తి చెందుతుందనీ. అయితే, సాధారణంగా కలిసిమెలిసి ఉండటం, చేతులు కలపడం, లేదా ఆహారం పంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి కాదని, త్వరిత పరీక్షలు, సమయానికి చికిత్స తీసుకోవడం ద్వారా హెచ్ఐవి ఉన్నవారు కూడా ఆరోగ్యంగా జీవించగలరని, అందువల్ల ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం అవసరమని, ముఖ్యంగా, వ్యాధి ఉన్న వ్యక్తులపై వివక్ష చూపకుండా, వారికి మద్దతు ఇవ్వడం మన సమాజ బాధ్యత అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ ఎస్ శాంత కుమారి, నర్సింగ్ ఆఫీసర్స్ బి. శ్రీనివాస్, కె. వరలక్ష్మి, సిబ్బంది మాదరి శిరీష, రాధా స్వామి, గణేష్, బాలరాజు, బాలాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు.