సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. బాలకృష్ణ
నాగారం సెప్టెంబర్ 8 తెలంగాణవార్త:- సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ పత్రిక ప్రకటనలో తెలిపారు. కేంద్రంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున కార్గే కు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం దేశం గర్వించదగ్గ విషయమని అన్నారు. పార్టీలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ప్రజాపాలన అందిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. బీసీ సామాజిక వర్గానికి పిసీసీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి పిసిసి పగ్గాలు అప్పజెప్పడంలో సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.