మండల స్థాయి సమీక్ష సమావేశం,

Aug 3, 2026 - 19:15
 0  2
మండల స్థాయి సమీక్ష సమావేశం,

03-08-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల ఎంపీడిఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేషం.

చిన్నంబావి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడం, అరుతడి (ప్రత్యామ్నాయ) పంటల సాగును ప్రోత్సహించడంపై అధికారులు చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ రఘునాథ్ రెడ్డి, మండల ఎంపీడీవో ఆదర్శ గౌడ్ తాసిల్దార్ శ్రీనివాస్ , ఎంపీఓ రామస్వామి, ఏపీఓ ధనంజయరాజు ఉద్యానవన శాఖ అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 తదననంతరం చిన్నంబావి మండల సర్పంచుల సంఘానికి నూతన నాయకత్వం. శరత్ కుమార్ రెడ్డి. గౌరవ అధ్యక్షులుగా గూడెం వెంకట్ రెడ్డి, కమలాబాయి, దివ్యశ్రీ.

చిన్నంబావి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వెలగొండ గ్రామ సర్పంచ్ శరత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయం. అలాగే ప్రధాన కార్యదర్శిగా మేకల పద్మావతి, ఉపాధ్యక్షులుగా నరసింహ, లీలావతి, కార్యవర్గ సభ్యులుగా శంకర్, గౌరవ అధ్యక్షులుగా వెంకటరెడ్డి,కమలాబాయి, దివ్యశ్రీ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సర్పంచుల హక్కుల పరిరక్షణలో ఈ నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు.

నాయకత్వం అంటే పదవి కాదు.. బాధ్యత!

ప్రజల విశ్వాసమే నిజమైన గెలుపు"

గ్రామాభివృద్ధే లక్ష్యం... ప్రజాసేవే ధ్యేయం."

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శరత్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి మేకల పద్మావతి గారికి, ఉపాధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ హార్దిక అభినందనలు. మీ నాయకత్వంలో చిన్నంబావి మండలంలోని గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State