సమాజంలో ప్రతి పౌరుడు సత్ప్రవర్తనతో జీవించాలి

Aug 24, 2024 - 19:57
Aug 24, 2024 - 21:29
 0  19
సమాజంలో ప్రతి పౌరుడు సత్ప్రవర్తనతో జీవించాలి

సమాజంలో ప్రతి పౌరుడు సత్ప్రవర్తనతో జీవించాలి

డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి విజ్ఞప్తి

నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో జీవించాలని

సూర్యాపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి .శ్రీవాణి ఉద్బోధించారు.

 శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసి ఖైదీలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. 

కక్షలు, కార్పన్యాలు, అనాలోచిత కోపాల వల్ల జీవితాలు, కుటుంబాలు వీధిన పడతాయని,

ఎవరు కూడా...ఆవేశపూరితంగా ఏ చర్యకు పాల్పడకూడదని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ వాణి విజ్ఞప్తి చేశారు.

ఏ వ్యక్తి అయినా నేరానికి పాల్పడితే వారి కుటుంబం సమాజంలో చెడుముద్ర ను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా సబ్ జైల్లో ఉన్న 32 మంది అండర్ ట్రయల్ ఖైదీలతో మాట్లాడారు.

తెలంగాణవార్త 24-08-2024 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- ఆలోచన లేకుండా ఆవేశంతో నేరాలకు పాల్పడి జైలు పాలు కావడం వల్ల సమాజంలో తలవంపులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నారు. ప్రతి వ్యక్తి సత్ప్రవర్తన కలిగి జీవించాలని అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని ఈ సందర్భంగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ శ్రీవాణి శుబోదించారు. ఈ సందర్భంగా సబ్ జైల్లో ఖైదీల కోసం ఏర్పాటుచేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేసి పదార్థాలను పరిశీలించారు.

 న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేని ముద్దాయిలకు ప్రభుత్వం ఉచితంగా న్యాయవాదులను నియమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవాలని సందర్భంగా ఖైదీలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కోర్టు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వసంత సత్యనారాయణ పిళ్లై యాదవ్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకట్ రత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వాణి పెండెం, సీనియర్ న్యాయవాదులు పోలెబోయిన నరసయ్య యాదవ్, గూడూరు శ్రీనివాస్, టింగిలికార్ రమేష్. పల్లేటి రాముడు, గొబ్బి నవీన్ కుమార్, కట్ట సుధాకర్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సూపరిండెంట్ కీత పద్మజ, డి .ఎల్ .ఎస్. ఏ. సిబ్బంది భాషా నాయక్, రాంబాబు , జైలు సిబ్బంది ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.*

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223