సభ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

తిరుమలగిరి 02 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ఈ నెల 14న తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ స్థలాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహా కలిసి పరిశీలించి అనంతరం సీఎం సభ ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి ప్రసన్న కుమార్ ఎమ్మార్వో హరి ప్రసాద్, ఎంపీడీవో లాజర్, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.