సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలి.

Sep 9, 2026 - 17:23
 0  3
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయాలి.

జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ సెక్రటరీ మధు నాయుడు.

 తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ సెక్రటరీ మధు నాయుడు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.శాసనసభాపతి పదవికి ఉన్న గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మధు నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభాపతిపై వ్యక్తిగతంగా,అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.ముఖ్యంగా ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి శాసనసభాపతి పదవిలో ఉండటాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.శాసనసభ అనేది ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక అని,ఆ వేదిక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.రాజకీయ విభేదాలు,విమర్శలు సహజమే అయినప్పటికీ రాజ్యాంగ పదవులను కించపరిచే స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మధు నాయుడు అన్నారు.ఎమ్మెల్సీలు తాత మధుసూదన్,నవీన్ రెడ్డిల వ్యాఖ్యలను ప్రభుత్వం, శాసనసభ తీవ్రంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు బాధ్యులైన ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని కోరారు.శాసనసభాపతి గౌరవాన్ని కాపాడటం అంటే రాజ్యాంగ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటమేనని,వ్యక్తులపై రాజకీయ కక్షతో రాజ్యాంగ పదవులను అవమానించే చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని మధు నాయుడు పిలుపునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333