సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

Jan 14, 2025 - 20:28
Jan 15, 2025 - 17:40
 0  50
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మండల పరిధి ఏపూర్ గ్రామంలో రామాలయం గుడి ముందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని DYFI ఆధ్వర్యంలో ఆడపడుచులు అందరికి ముగ్గుల పోటీలో గ్రామంలో అడపడుచులందరు పాల్గొన్నారు.క్రి.శే ఎరుకల నర్సయ్య,ఎరుకల సతీష్ ల జ్ఞాపకార్థంగా ముగ్గుల పోటీలో విజేతలకు ఎరుకల నాగరాజు సరిత దంపతులు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి పోకబత్తిని రాణి,2వ బహుమతి నేతగాని శ్రావ్య,3వ బహుమతి అనూష,4వ బహుమతి విరాట్ చెర్రీ,5వ బహుమతి పూజిత లకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అవిరే అప్పయ్య,సానబోయిన సుధాకర్,సానబోయిన ఉపేందర్,బుడిగే లింగయ్య,దామిడి రాజు,పరికపల్లి శ్రీ రంగం,గిరి తదితరులు పాల్గొన్నారు