శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

Mar 21, 2024 - 17:59
Mar 21, 2024 - 19:41
 0  9
శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

మునగాల 21 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో శ్రీశ్రీ శ్రీ సీతారామచంద్రస్వామి, హనుమాన్, జీవధ్వజ శిఖర గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ద్వారపాలక, ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు, ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర దేవాలయకమిటీ చైర్మన్ జూకురి అంజయ్య, మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 17,18,19,20,21, తేదీలలో నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుపుటకు వేదమూర్తులైన, బ్రాహ్మణులచే, గ్రామ ప్రజల సమక్షంలో ముహూర్తం నిర్ణయించారు అని, ఇట్టి కార్యక్రమానికి కోదాడ శాసనసభ్యులు నల్లమాదా ఉత్తమ్ పద్మావతిరెడ్డి, ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారని, ఇట్టి కార్యక్రమానికి మండల ప్రజా ప్రతినిధులు పత్రిక విలేకరులు అధికారులకు సాదరఆహ్వానం పలుకుతున్నాము అని, ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీ వారణాసి ఉదయ్ భాస్కర్ చర్మ, బీసీ యువజనసంఘం జిల్లాఅధ్యక్షులు కొంపెల్లి వీరబాబు గౌడ్, గ్రామ ఎంపీటీసీ సభ్యులు గన్న భవాని నరసింహారావు, దొంగరి అప్పారావు, అమరగాని వీరభద్రం, పనస విజయ్,మండవ చిన్న సైదులు, కుడుముల వీరయ్య, బెల్లంకొండ నాగయ్య, మునగలేటి తిరపయ్య, పల్లె శ్రీరాములు, పనస పెద్ద శీను, మండవ వీరబాబు, సిర్ర వీరభద్రం, దొంగరిమోహన్ రావు, బెల్లంకొండ మధు, తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State