శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుట ధర్నాకు పిలుపునిచ్చిన PDSU సూర్యాపేట జిల్లా కమిటీ
*రేపు, శ్రీచైతన్య విద్యా సంస్థల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చిన PDSU సూర్యాపేట జిల్లా కమిటీ.*
PDSU ఆధ్వర్యంలో రేపు, జిల్లాలోని అన్ని శ్రీచైతన్య విద్యా సంస్థల ముందు ధర్నాలకు పిలుపునిచ్చినట్టు PDSU జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట లో మాట్లాడుతూ.. శ్రీచైతన్య విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై ఈడి, సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు పిలుపును ఇచ్చామన్నారు.