వ్యవసాయ మోటర్లు దొంగతనం చేస్తున్న దొంగల ముఠా అరెస్ట్

Aug 27, 2024 - 22:08
Aug 28, 2024 - 13:36
 0  10
వ్యవసాయ మోటర్లు దొంగతనం చేస్తున్న దొంగల ముఠా అరెస్ట్

వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్

-26 కేసుల్లో 4 గురు దొంగలను, దొంగ మోటార్లు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన గరిడేపల్లి పోలీసులు.

-26 కేసుల్లో 4.34 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ (కాఫర్ వైర్) అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు సీజ్. ఆటో, 3 బైక్, సెల్ ఫోన్స్ స్వాధీనం.

- గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్లచేరువు పోలీసు స్టేషన్ ల పరిధిలో మోటార్లు దొంగతనం కు సంభందించి 26 కేసులు నమోదు.

సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు గరిడేపల్లి ఎస్సైలు సైదులు నరేష్ సిబ్బంది ఉన్నారు. 

    కోదాడ సబ్ డివిజన్ పరిధిలో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు మరియు మోటార్ కోర్ లు (కాఫర్ వైర్) దొంగతానులు చేస్తున్న దానిపై పోలీసు సిబ్బంది అప్రమత్తమై నిఘా ఉంచడం జరిగినది. కేసుల దర్యాప్తు లో భాగంగా సోమవారం 26/8/24 రోజున గరిడేపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మలచెరువు రోడ్డు లో పరెడ్డిగూడెం స్టేజి వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ద్విచక్రవానంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు NTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు (A1), మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు (A2) పోలీసు వారిని గమనించి తప్పించుకోవాలని ప్రయత్నించగా అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇరువురి వద్ద 5 లక్షల నగదు ఉన్నది, దీనిని విచారించగా వారు మోటార్లు, మోటార్ కోర్ వైర్ దొంగతనం చేసి అమ్ముతున్నట్లు గుర్తించడం జరిగినది. మోటార్ కోర్ అమ్మిన డబ్బులు అకారపు వెంకటి (A3), అజ్మీర మంత్రియ (A4) నలుగురము గత సంవత్సరము నుండి దొంగతనాలు చేసి అమ్మిన సొత్తును మట్టంపల్లికి చెందిన పాతసామాను వ్యాపారి ఏ5 శ్రీను వద్ద ఉంచి ఈరోజు పంచుకుని తీసుకువెళుతున్నాము అన్నారు. ఏ1, ఏ2 లు తెలిపిన వగ్మూలం ఆధారంగా నిఘా ఉంచు కాసారిగూడెం వద్ద అకారపు వెంకటి (A3), అజ్మీర మంత్రియ (A4) వేరువేరు బైక్స్ పై వస్తుండగా పట్టుకుని వీరి నుండి 3.81 లక్షల నగదు స్వాదినం చేసుకోవడం జరిగినది. వీరి ఒప్పుకొలు ఆధారంగా మటంపల్లి లోని పాతసమాను వ్యాపారి A5 శ్రీను వద్ద 1.20 లక్షల నగదు స్వాదినం చేసుకోవడం జరిగినది. మొత్తం 10 లక్షల 1 వేయి నగదు సీజ్ చేశారు. పోలీసు వారి నిఘా ఉన్నందున వైర్ అమ్మిన డబ్బు మొత్తం వ్యాపారివద్దే ఉంచి పంచుకుని వెళ్ళే క్రమంలో పోలీసు పట్టుబడి చేశారు. ఈ మొత్తం నగదు 135 మోటార్ల నుండి దొంగిలించిన వైండింగ్ కాఫర్ వైర్ అమ్మగా వచ్చినది అని ఒప్పుకున్నారు. అలాగే Rs. 4,34,000/- విలువ గల 31 మోటార్ లు సీజ్ చేయడం జరిగినది. అలాగే దొంగతనానికి ఉపయోగించే ఆటో, 3 బైక్, సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. 

 

    ఆంధ్ర రాష్ట్రం NTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు (A1), మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు (A2), అకారపు వెంకటి (A3), అజ్మీర మంత్రియ (A4) నలుగురు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించడం కోసం నలుగురు కలిసి హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సర కాలం నుండి నుండి గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, చిలుకూర్ పోలీసు స్టేషన్ ల పరిధిలో వ్యవసాయ బావులపై మరియు వాగులపై, చెరువులపై రైతులు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్ లను దొంగిలించడం కోసం పగటిపూట రక్కి చేసి మోటార్ లు ఎక్కడ ఉన్నావో గుర్తించి అదే రోజు రాత్రి కానీ తెల్లారి కానీ అర్ధరాత్రి బైక్ మరియు ట్రాలి ఆటొ పై వచ్చి వీలు అయితే మోటార్ లు ఎత్తుక వెళ్లడం లేదా మోటార్ లోని వైండింగ్ కోర్ ఎత్తుక వెళ్ళి వాటిని మట్టంపల్లి గ్రామానికి పాత ఇనుము వ్యాపారి గడగంట్ల శ్రీను కు అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

“ముద్దాయిలు:     

A-1) ఉప్పతల వాసు వ: 24 సం.లు, వృత్తి: కూలీ, R/o ముప్పాళ్ళ గ్రామం చందర్లపాడు మండలం యన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం.  

A-2) వేముల కోటేశ్వర్ రావు వయస్సు: 33 సంవత్సరములు, వృత్తి: రాయికొట్టే పని (కూలీ), నివాసం: రఘునాథపాలెం గ్రామము, మటంపల్లి మండలం.

A-3) అకారపు వెంకటి వయస్సు: 26 సంవత్సరములు, వృత్తి: కూలి, నివాసం: గుండ్లపల్లి గ్రామము, మటంపల్లి మండలం.

A-4) అజ్మీర మంత్రియ వయస్సు: 32 సంవత్సరములు, వృత్తి: కూలి, నివాసం: సుల్తాన్ పురం తండా గ్రామము, మటంపల్లి మండలం.

Receiver:-  

A-5) గడగంట్ల శ్రీను వయస్సు: 45 సంవత్సరములు, వృత్తి: పాత ఇనుము వ్యాపారం, నివాసం:, మటంపల్లి గ్రామం మరియు మండలం.

నిందితుల గత నేర చరిత్ర

A-1 తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎన్‌టి‌ఆర్ జిల్లా వత్సవాయి పి యస్ లో Cr.NO.453/2020 U/s 34 (a) AP Excise act గా కేస్ నమోదు అయినది. A-3 పై మట్టం పల్లి పి యస్ పరిధిలో నేరం సంఖ్య 100/2012 హత్య కేస్, A-5 పై Cr.No.106/2007 U/s 379 IPC కేస్, అక్రమ ప్రజాపంపిణీ బియ్యం కలిగి ఉండగా Cr.No. 74/2024 U/s 420 IPC, 7 of EC Act ప్రకారం గా కేస్ నమోదు అయినవి.A1 ఉప్పతల వాసు పై ఆంధ్రాలో వత్సవాయి PS లో 453/2023 అక్రమ మద్యం కేసు, A2 వేముల కోటేశ్వరరావు పై మఠంపల్లి PS లో హత్యకేసు, A5 గడగంట్ల శ్రీను పై PDS రైస్ కేసు తరలింపులో 2 కేసులు ఉన్నాయి.

ఇట్టి కేస్ ను చేధించిన హుజూర్ నగర్ సి ఐ G.చరమందరాజు, గరిడేపల్లి యస్ఐ లు సైదులు, సి‌హెచ్ నరేష్, ఐ‌డి పార్టీ సిబ్బంది కానిస్టేబుల్ నాగరాజు, శ౦భయ్య, రామారావు లను ఎస్పి  అభినందించారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223