శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్ల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాటి

Mar 13, 2026 - 14:18
 0  0
శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్ల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాటి
శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్ల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తాటి

దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో కుమ్మర శాలివాహన కులస్తుల ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్ల గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం మాజీ తొలి  ట్రైకార్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.. ఈ సందర్భంగా కుమ్మర శాలవాహన సంఘం నాయకులు తాటి గారిని శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను రాసినది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయం (16వ శతాబ్దం) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైంది, రమణీయమైంది అన్నారు. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో[1] కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంది అన్నారు..

ఈ కార్యక్రమం లో అంకత ఉమా మహేశ్వరరావు, రాచురిపల్లి సర్పంచ్ చిట్టి బాబు,మల్కారం మాజీ సర్పంచ్ రూప్ సింగ్, దమ్మపేట మాజీ ఉప సర్పంచ్, రావూరి వీరయ్య, తిరువీధుల ధన్ రాజ్, నల్లపు నాగేంద్ర, బాలాజీ, ఈశ్వర్, యేసు బాబు, శ్రీను, వార్డ్ మెంబర్ సవలం నరసింహ రావు, గోవింద రావు కుమ్మర శాలవాహన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333