శ్రీశైలం నిర్వసితుల గుండెలు ఆగిన? నిర్వాసితుల గురించి పట్టించుకోని పాలకులు

Jul 27, 2026 - 20:08
Jul 28, 2026 - 18:14
 0  2
శ్రీశైలం నిర్వసితుల గుండెలు ఆగిన? నిర్వాసితుల  గురించి పట్టించుకోని పాలకులు

27-07-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం :  చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన పెద్దమారు  గ్రామంలో శ్రీశైల నిర్వాసితుల సమావేశం. శ్రీశైలం నిర్వాసితుల ఊపిరి ఆగిన.. ఇంటికో ఉద్యోగం గురించి పట్టించుకోని పాలకులు? నలభై సంవత్సరాల నరక 

..యాత్రన  బ్రతుకులు.

ఓట్ల కోసం ఓడిగం చేసి... గెలిచాక పట్టించుకోని నాయకులు. 

జీఓలు ‘కాగితాల’కే పరిమితం.. 2,000 మందికి నెరవేరని హామీలు.

 మాపై కంకణం కట్టుకున్న నాయకులకు ఆ కృష్ణమ్మ నీళ్లు తాపే వరకు వదలం. ఇప్పటివరకు ఒక లెక్క... ఇప్పటినుంచి మరో లెక్క 

పెద్దమారూర్ వేదికగా ఉమ్మడి పాలమూరు బాధితుల నిప్పుల వర్షం.

కృష్ణమ్మ డ్యామ్ కడితే కదలిచ్చిన ఊళ్లను, తరతరాల నమ్ముకున్న భూములను దేశ శ్రేయస్సు కోసం త్యాగం చేశాం.. కానీ 40 ఏళ్లుగా మా జీవితాలు నీళ్లపాలై నరకం అనుభవిస్తుంటే, ఈ ఏలే పాలకుల గుండెలు రాయిగా మారాయా..? ఓట్ల కోసం వచ్చి చేతులెత్తి మొక్కి బాసలు చేయడం.. గెలిచాక మా గోడును గాలికొదిలేసి వంచించడం నిత్యకృత్యమైంది. ఇక మీ అబద్ధపు హామీలను నమ్మే ప్రసక్తి లేదు.. మా హక్కుల కోసం ఉద్యమ బాట పడతాం!" — శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపుతో సర్వస్వం కోల్పోయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నిర్వాసితుల కన్నీటి నిప్పుల వర్షమిది.

​వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారూర్ గ్రామంలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, చిన్నంబావి సహా కృష్ణానది పరివాహక ప్రాంతాల ముంపు బాధితుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్వేగపూరిత ఆవేదన సదస్సు జరిగింది.రాజకీయనాయకుల కల్లబొల్లి మాటలు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై నిర్వాసితులు నిప్పులు చెరిగారు.

​ *ఆశలతోనే చచ్చిన 400 మంది.. ఉసురు తగలకుండా చూడండి..!* 

​నాడు దివంగత ఎన్‌.టి.రామారావు తెచ్చిన జీఓ 98 నుంచి, నిన్నటి జీఓ 68 వరకు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని బాధితులు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 67 ముంపు గ్రామాల్లోని కుటుంబాలకు ఉద్యోగం రాక, బ్రతుకుదెరువుకు సరైన పరిహారం అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందన్న ఆశతో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఇప్పటికే 400 మందికి పైగా బాధితులు కన్నుమూయడం కన్నా ఘోరం ఏముంటుందని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికీ 2,000 మందికి పైగా నిర్వాసితులు అనాథల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ *ముఖ్యమంత్రులూ మారారు.. మాటలు మారలేదా..?* 

​ఎన్నికలు రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్ నాయకులంతా వచ్చి ఆదుకుంటామని చెవిలో పువ్వులు పెట్టడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఏడాది కిందట పెంట్లవెల్లి మండలం జటప్రోలుకు విచ్చేసిన స్వయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి "పాలమూరు బిడ్డగా మీ బాధ నాకు తెలుసు.. ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా తగిన నష్టపరిహారమైనా ఇప్పించి ఆదుకుంటాం" అని సభాముఖంగా చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాది గడిచినా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం బాధితులను తీవ్రంగా వంచించడమేనన్నారు. అధికారులైతే సాంకేతిక సాకులు చెబుతూ ఫైళ్లను పక్కన పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​ *ఊరూరా నిరసన జ్వాలలు.. తేల్చుకునేందుకు సిద్ధం..!* 

​ఇక లాలూచీ పడేది లేదని, నాయకులు, అధికారులను బతిమిలాడే రోజులు పోయాయని బాధితులు హెచ్చరించారు. పెద్దమారూర్ సభ వేదికగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామాన్ని ఏకం చేస్తామని, ఓట్ల కోసం వచ్చే నాయకులను గడపగడపనా నిలదీసేందుకు భవిష్యత్తు ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తు వీడి తమ 40 ఏళ్ల దయనీయ స్థితికి ముగింపు పలకాలని, లేనిపక్షంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State