శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు

Sep 8, 2026 - 19:18
 0  2
శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు

ప్రతి కేసును లోతుగ విశ్లేషించి, పునరావృతం కాకుండ చూడాలి.

 జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జిల్లాలో నమోదైన శిశు మరణాలపై DMHO డా. సంధ్యా కిరణ్మయి ఆధ్వర్యంలో, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. అస్గర్ అలీ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య నిపుణులతో సమగ్ర శిశు మరణాలపై DMHO కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 
ప్రతి శిశు మరణాన్ని కేసు వారిగ పరిశీలించి, వైద్య, సామాజిక, కుటుంబ, గర్భధారణ, ప్రసవ మరియు ప్రసవానంతర కారణాలను లోతుగ విశ్లేషించారు. ANC సేవలు, ప్రమాద గర్భిణుల గుర్తింపు, రిఫరల్, ప్రసవ సమయంలో అత్యవసర వైద్య సేవలు, నవజాత శిశు సంరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగ సమీక్షించారు. ప్రమాద గర్భిణులను ముందుగానే గుర్తించడం, నిర్ణీత సమయంలో ANC పరిక్షలు నిర్వహించడం, రక్తహీనతను గుర్తించి చికిత్స అందించడం, ప్రమాద పరిస్థితుల్లో సకాలంలో రిఫర్ చేయడం వంటి చర్యలను పటిష్టంగ అమలు చేయాలని సూచించారు. అలాగే శిశువుల్లో శ్వాసలో ఇబ్బంది, పాలు తాగకపోవడం, జ్వరం, శరీరం చల్లబడటం, మూర్ఛలు, నీరసం, అధిక పసుపుదనం వంటి ప్రమాద సంకేతాలను తల్లిదండ్రులు, ఆశా కార్యకర్తలు, ANMలు సకాలంలో గుర్తించి వెంటనే వైద్య సేవలు అందేల చూడాలని తెలిపారు. “ప్రతి శిశువు ప్రాణం ఎంతో విలువైనది. ఒక్క శిశు మరణం కూడ పునరావృతం కాకుండ క్షేత్రస్థాయి నుంచే నివారణ చర్యలు పటిష్టంగ అమలు చేయాలి. ప్రతి కేసు లోపాలను గుర్తించి సరిదిద్దుతు శిశు మరణాల నివారణకు సమష్టిగ కృషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ANMలు మరియు ప్రోగ్రాం అధికారులు డా. ప్రసూన రాణి, డా. రాజు, SO తిరుమల్ రెడ్డి, DPHNO వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333