శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అదనపు కలెక్టర్ నర్సింగరావు.
జోగులాంబ గద్వాల 22 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల పైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందేందుకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పలు శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
బుధవారం గద్వాలలోని ప్రభుత్వ ఎంఏఎల్డి డిగ్రీ కళాశాలలో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకంపై విద్యార్థులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. పుట్టగొడుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని అందించే ఉపాధి మార్గమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ షేక్ కలందర్, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.