వెల్దేవి గ్రామంలో డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
అడ్డగూడూరు01 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి శ్రీకళ సుందర్ అన్న కీర్తిశేషులు పిల్లి గంగయ్య రమణ రెండవ కుమారుడు పిల్లి సతీష్ (23) సంవత్సరాలు గత కొన్ని రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,పొన్నాల వెంకటేశ్వర్లు పిఎసిఎస్ మాజీ చైర్మన్,వారితో పాటు బాలెంల అరవింద్ బీఆర్ఎస్వి తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,గూడెపు పరమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,గూడెపు నరేష్ టిఆర్ఎస్ వై పట్టణ అధ్యక్షులు,గజ్జెల్లి రవి బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి,వెల్దేవి గ్రామ శాఖ అధ్యక్షులు సోమయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి గంగయ్య,కూతటి గణేష్ ,వెల్దేవి గ్రామంలో మ స్నేహితుడు సతీష్ ఇక లేడని స్నేహితులు తల్లడిల్లారు.మా నుండి ఆ దేవుడు దూరం చేసిన మా గుండెల్లో ఎప్పుడు ఉంటావని స్నేహితుల్లో ఉన్న మాట గ్రామస్తులు,బంధువులు,మిత్రులు ఆర్తనాదాలు పెట్టారు.