మా గ్రామాల్లో సంపూర్ణంగా మద్యం బంద్ గట్టికల్లు పాతర్ల పహాడ్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ మధ్య వద్దంటూ ఊరు కదిలింది గట్టిగల్లు పాతర్ల పహాడ్ గ్రామాల్లో మద్యపాన నిషేధం పై అఖిలపక్ష సమావేశం. మద్యం తాగవద్దు అమ్మ వద్దు.. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కు గ్రామస్తుల ప్రతిజ్ఞ.. బెల్ట్ షాపులు బంద్ చేయాలంటూ ర్యాలీ. ఆత్మకూర్ ఎస్... ప్రశాంతమైన పల్లెల్లో మద్యం మహామ్మారి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అందుకే మా గ్రామాల్లో మద్యం నిషేధించాలంటూ పల్లెలు నిద్రలేచి ప్రతిజ్ఞలు చేసుకున్నాయి. ఆత్మకూరు మండలంలోని గట్టికల్లు పాతర్లపాడు గ్రామాల్లో గాంధీ జయంతి సందర్భంగా గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలంటే వందలాదిమంది సమావేశాలు ఏర్పాటు చేసుకొని తీర్మానాలు ప్రతిజ్ఞలు చేసుకున్నారు గ్రామంలో మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించారు. గట్టిగల్లులో అఖిలపక్షాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇకనుండి గ్రామంలో ఎప్పుడు మద్యం అమ్ముటకాని తాగడం కానీ చేయరాదు అంటూ ప్రతిజ్ఞ చేశారు. పాతర్లపాడులో మధ్య విక్రయించిన తాగిన జరిమానాలు విధించబడతాయని తీర్మానాలు చేసుకున్నారు. గట్టికల్లో జరిగిన మధ్య నిషేధ కార్యక్రమానికి మండల ఎస్సై వై సైదులు విచ్చేసి గ్రామాల్లో మధ్య నిషేధం చేసుకోవడం సంతోషకరమైన శాంతియుతంగా ఉద్యమాలు చేసుకొని గ్రామాల అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. కిరాణా షాపులు మరే విధమైన ప్రాంతాల్లో గుట్కా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని యువకులు సమాచారం ఇవ్వాలంటే కోరారు. ప్రతి రాజకీయ పార్టీల కుల సంఘాల,యువజన సంఘాల నుంచి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు యువజన సంఘాలు మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యపాన నిషేదానికి మండల జర్నలిస్టు సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది.