వెల్దేవి గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ పండుగ సంబరాలు
అడ్డగూడూరు 21 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆడపడుచులందరూ నూతన వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ కార్యక్రమం ముగించుకొని బతుకమ్మని చేతపట్టి ఏట్లో ఓచోట కూడిన మహిళలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఎంగిలిపు బతుకమ్మ సంబరాన్ని నిర్వహించరు. ముందుగా ఎంగిలిపు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొంతమంది మహిళలు మాట్లాడుతూ..ఈ పండుగ తెలంగాణలోని ఆడపడుచులు పువ్వులను పూజించే గొప్ప అవకాశం మన తెలంగాణలోని ఉందన్నారు.ఈ పండుగ ప్రపంచంలోనే మరెక్కడా లేదు.తొలి రోజు తీరక్క పువ్వుతో ఎంగిలి పూల బతుకమ్మ నుంచి 9వ రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజూ పండుగ రోజే..తీరొక్క పూలతో నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మను పేర్చి.. ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆటపాటలతో ఆనందంగా జరుపుకునే పండుగ అని అన్నారు.ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు,తదితరులు పాల్గొన్నారు.